News25th Dec 12:33 PMSunil Byrisetty1 min read
గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై విజ్ఞప్తి
విజయవాడ సుస్థిర, ప్రణాళికబద్దమైన అభివృద్దికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించి గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చేయటం అత్యవసరమని సీఎం చంద్
విజయవాడ సుస్థిర, ప్రణాళికబద్దమైన అభివృద్దికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించి గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చేయటం అత్యవసరమని సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సచివాలయంలో వీరివురు సీఎం చంద్రబాబు ను కలిసి ప్రతిపాదనలు అందజేశారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో వున్న గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. నగర పరిసరాల్లోని 75 గ్రామాలు విలీనమై గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ఏర్పాటు జరిగితే పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్ హబ్‌లు, పర్యాటక పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం లభించి, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని, సమగ్ర నీటి సరఫరా, వరద నియంత్రణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయటానికి అవకాశం వుంటుందని వివరించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా–కృష్ణా జిల్లా మధ్య ఉన్న పరిపాలనా విభజన వల్ల పోలీస్, రవాణా, శాంతి భద్రతలు, విమానాశ్రయ పరిపాలన వంటి అంశాల్లో తలెత్తుతున్న ప్రోటో కాల్ ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుందన్నారు. విజయవాడ నగర అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని ఎంపీ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.