News27th Oct 05:22 PMSunil Byrisetty1 min read
కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్దికి ఎంపీ కేశినేని శివనాథ్ కృషి
కొండపల్లి రైల్వే స్టేషన్ లో రైళ్లు ఎక్కేందుకు, దిగేందుకు అనువుగా సరైన ప్లాట్ ఫామ్ లేకపోవటంతో ప్రయాణీకుల పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వ
కొండపల్లి రైల్వే స్టేషన్ లో రైళ్లు ఎక్కేందుకు, దిగేందుకు అనువుగా సరైన ప్లాట్ ఫామ్ లేకపోవటంతో ప్రయాణీకుల పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సమన్వయం తో, ప్రజల విజ్ఞప్తి మేరకు ఎంపీ కేశినేని శివనాథ్ చేసిన కృషి ఫలించింది.
కొండపల్లి రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫారమ్ విస్తరణ, ఎత్తు పెంపు కోసం ఎంపీ కేశినేని శివనాథ్ చేసిన ప్రతిపాదన కు దక్షిణ మధ్య రైల్వే అంబ్రెల్లా వర్క్స్ 2024-25లో ఆమోదం లభించింది. కొండపల్లి రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణ ఎత్తు పెంపు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ విషయాన్ని లేఖ ద్వారా ఎంపీ కేశినేని శివనాథ్ కి తెలియపర్చారు. అలాగే ఎంపీ కేశినేని శివనాథ్ అమృత్ స్టేషన్ పథకం కింద కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ది చేయాలని కోరిన ప్రతిపాదనను తర్వాత దశలో పరిగణలోకి తీసుకుంటామని తెలియపర్చారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.