News18th Dec 04:14 PMSunil Byrisetty1 min read

విజయవాడ రైల్వే అభివృద్ధిపై ఎంపీ కేశినేని శివనాథ్ కృషి

విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదల లక్ష్యంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ అడుగులు వేస్తున్నారు. పార్ల‌మెంట్ హౌస్ లో కేంద్ర రైల్వే

విజయవాడ రైల్వే అభివృద్ధిపై ఎంపీ కేశినేని శివనాథ్ కృషి
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదల లక్ష్యంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ అడుగులు వేస్తున్నారు. పార్ల‌మెంట్ హౌస్ లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ ను ఆయ‌న కార్యాల‌యంలో ఎంపీ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి తో క‌లిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్ క‌లవ‌టం జ‌రిగింది. ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు–రైలు సమన్వయంతో కూడిన సమగ్ర రవాణా ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరం గురించి, జిల్లాలో పెరుగుతున్నరైల్వే రవాణా రద్దీ సమస్యల పరిష్కారానికి భ‌విష్య‌త్తు ప్రణాళిక పై , కొండపల్లి–విజయవాడ రైల్వే ట్రాక్ వెంట నీటి నిల్వ సమస్యల పరిష్కారంపై చ‌ర్చించారు. విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఉన్న అధిక రద్దీని తగ్గించేందుకు గొల్లపూడిలోని బల్బ్ లైన్ల పరిధిలో శాటిలైట్/ హాల్ట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ ప్రాంతం రైల్వే అవసరాల కోసం భూసేకరణకు అనుకూలంగా ఉందని, ప్రధాన రహదారులు, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం, అలాగే రాబోయే అమరావతి న్యూ రైల్వే లైన్‌కు సమీపంలో ఉండటం వల్ల ఇది భవిష్యత్ రాజధాని అభివృద్ధికి కీలక కేంద్రంగా మారే అవకాశముందని వివరించారు.
Andhra Pradesh
Vijayawada
Vijayawada Railway
Railway Development
Kesineni Sivanath
MP Kesineni
Ashwini Vaishnaw
Indian Railways
మౌలిక వసతుల అభివృద్ధి
ప్రజా రవాణా
అమరావతి
Scroll for the next article