News25th Mar 08:56 AMSunil Byrisetty1 min read
ఏపీలో ఢిల్లీని మించిన మద్యం కుంభకోణం!
గత ప్రభుత్వంలో నాటి సీఎం జగన్ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని టిడిపి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. జగన్ బంధువు సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్ కి రెండువేల కోట్లు మధ్యం డబ్బ
గత ప్రభుత్వంలో నాటి సీఎం జగన్ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని టిడిపి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
జగన్ బంధువు సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్ కి రెండువేల కోట్లు మధ్యం డబ్బు తరలించారని లోక్ సభలో సంచలన విషయాలను బయటపెట్టారు.
2,000 కోట్ల రూపాయలు ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్‌కి మళ్లించారని వివరించారు.
Adan, Graysons, Leela, JR Associates, PV Spirits లాంటి 26 కొత్త కంపెనీలు భారీ లాభాలను పొందాయని బయటపెట్టారు.
రూ. 20,356 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను గోప్యంగా నిర్వహించారని, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కన్నా జగన్ మద్యం కుంభకోణం అతి పెద్దదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
లిక్కర్ ఉత్పత్తికి ముందే స్కామ్ చేసిన ఘనత జగన్‌దేనన్నారు.
జగన్ తన ఆధీనంలోని సంస్థల ద్వారా మద్యం వ్యాపారాన్ని పూర్తిగా నియంత్రించి ప్రజలను మోసం చేశారన్నారు.
ప్రముఖ మద్యం బ్రాండ్లను పూర్తిగా తొలగించి, అధ్వాన్నమైన కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.
నంద్యాలలోని SPY ఆగ్రో ఇండస్ట్రీస్ లాంటి ప్రముఖ డిస్టిలరీలను బలవంతంగా తీసుకుని, కొత్త బినామీ డిస్టిలరీలను ఏర్పాటు చేశారని ఎంపీ లావు చెప్పారు.