News1st Dec 12:51 PMSunil Byrisetty1 min read

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో తరచూ చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ తిరుపతి ఎంపీ డా.మద్దిల గురుమూర్తి లోక్‌సభలో కీలక ప్రశ్న వేశారు. గత

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో తరచూ చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ తిరుపతి ఎంపీ డా.మద్దిల గురుమూర్తి లోక్‌సభలో కీలక ప్రశ్న వేశారు. గత ఏడాది కాలంలో తిరుపతి పార్లమెంటు పరిదిలోని నాయుడుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి తోపాటుగా రాష్ట్రంలో జరిగిన పలు సంఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. పరిశుభ్రతా లోపం, పాడైన ఆర్ఓ ప్లాంట్లు, శుభ్రం చేయని నీటి ట్యాంకులు, వంటగది పరిశుభ్రతా లోపం వంటి కారణాల వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో ఎంపీ ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం వంటి వివరాలు కోరారు. ఈ ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన సమాచారం గురించి ప్రస్తావిస్తూ, ఇటీవల కొన్ని పాఠశాలలలో నీరు, ఆహారం కలుషితం కావడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు మంత్రి స్పష్టం చేశారు. అయితే, వారందరికీ వైద్య చికిత్స అందించి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించి, లోపాలు ఉన్న చోట వెంటనే సరిదిద్దినట్లు తెలిపారు.
Andhra Pradesh
Food Poisoning
Government Schools
Student Safety
Tirupati MP
మద్దిల గురుమూర్తి
లోక్‌సభ
కేంద్ర విద్యాశాఖ
ప్రజా ఆరోగ్యం
Scroll for the next article