News9th May 09:33 AMSunil Byrisetty1 min read

దేవుడా.. కాపాడు అంటున్న పాక్!

భారత్ బీకర దాడులతో పాకిస్తాన్ గజగజ వణుకుతోంది. భారత్‌ చేస్తున్న దాడులను ఎదుర్కోవడంలో విఫలమవుతుండడం.. రోజురోజుకు తీవ్ర పరిస్థితులు ఎదురవుతుండడంతో పాకిస్థాన్‌ ఎంపీ పార్లమెంట్‌లో కన్న

దేవుడా.. కాపాడు అంటున్న పాక్!
భారత్ బీకర దాడులతో పాకిస్తాన్ గజగజ వణుకుతోంది. భారత్‌ చేస్తున్న దాడులను ఎదుర్కోవడంలో విఫలమవుతుండడం.. రోజురోజుకు తీవ్ర పరిస్థితులు ఎదురవుతుండడంతో పాకిస్థాన్‌ ఎంపీ పార్లమెంట్‌లో కన్నీటిపర్యంతమయ్యాడు. 'దేవుడా నీవే కాపాడు' అంటూ ప్రార్థించాడు. పాకిస్థాన్‌కు చెందిన ఆర్మీ మాజీ మేజర్‌ తాహీర్‌ ఇక్బాల్‌ ఎంపీగా కొనసాగుతున్నారు. భారత్‌ సృష్టిస్తున్న విధ్వంసంపై తాహీర్‌ ఇక్బాల్‌ భయాందోళన చెందారు. పాకిస్థాన్‌ పార్లమెంట్‌లో మాట్లాడుతూ భారత్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని వివరిస్తూ తమ ప్రభుత్వం కాపాడలేదని చేతులెత్తేశారు. ' భారతదేశం నుంచి పాకిస్థాన్‌ను కాపాడండి' అంటూ విజ్ఞప్తి చేశారు. 'దేవుడా ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచు' అని తాహీర్‌ ఇక్బాల్‌ ప్రార్థించారు.
PAKISTAN
Operation Sindoor
India attack on Pak
Pahalgam Attack
MP Tahir Iqbal
పాకిస్థాన్‌ ఎంపీ పార్లమెంట్‌లో కన్నీటిపర్యంతమయ్యాడు
భారతదేశం నుంచి పాకిస్థాన్‌ను కాపాడండి అంటూ విజ్ఞప్తి
Scroll for the next article