News16th Nov 02:56 PMSunil Byrisetty1 min read

బిర్సా ముండా జీవిత చ‌రిత్ర ఆవిష్కరించిన ఎంపీ

గిరిజన నాయకుడు, స్వాతంత్య్ర‌ సమరయోధుడు బిర్సా ముండా జీవిత చ‌రిత్ర పుస్త‌కం ఆవిష్క‌రించ‌టం చాలా ఆనందంగా వుంద‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. బిర్సా ముండా 150 జ‌యంతిని ప

బిర్సా ముండా జీవిత చ‌రిత్ర ఆవిష్కరించిన ఎంపీ
గిరిజన నాయకుడు, స్వాతంత్య్ర‌ సమరయోధుడు బిర్సా ముండా జీవిత చ‌రిత్ర పుస్త‌కం ఆవిష్క‌రించ‌టం చాలా ఆనందంగా వుంద‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. బిర్సా ముండా 150 జ‌యంతిని పుర‌స్క‌రించుకుని తెలుగులో ముద్రించిన డా. మోహ‌న్ భాగ‌వ‌త్ రాసిన భ‌గ‌వాన్ బిర‌సా ముండా జీవిత చ‌రిత్ర‌ పుస్త‌కాన్ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆవిష్క‌రించారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్లో ఆదివారం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. టిడిపి నాయ‌కులు, నేష‌న‌ల్ కమీష‌న్ మాజీ మెంబ‌ర్ మాదిగాని గురునాథం బిర్సా ముండా చిత్ర ప‌టాన్ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు బ‌హుక‌రించారు.
Birsa Munda
Biography Launch
Vijayawada
MP Kesineni Sivanath
Tribal Freedom Fighter
Dr. Mohan Bhagwat
Telugu Biography
TDP Leaders
Gurunanak Colony Event
NTR Bhavan
Tribal History
Scroll for the next article