Politics10th Aug 10:36 AMSunil Byrisetty1 min read

వైసీపీలోకి విజయసాయి రీ ఎంట్రీ?

రాజకీయాలకు గుడ్ బై చెప్పి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి తిరిగి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. విజయసాయి గతంలో పార్టీని అన్ని విధాలా ముందుకు నడిపించారు. విశాఖ వంటి బ

వైసీపీలోకి విజయసాయి రీ ఎంట్రీ?
రాజకీయాలకు గుడ్ బై చెప్పి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి తిరిగి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. విజయసాయి గతంలో పార్టీని అన్ని విధాలా ముందుకు నడిపించారు. విశాఖ వంటి బలమైన టీడీపీ కంచుకోటలో పాగా వేసేలా చేశారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయానికి కర్త-కర్మ-క్రియ ఆయనే. అయితే.. వైసీపీలో అంతర్గత రాజకీయాల కారణంగా.. సాయిరెడ్డి పార్టీకి దూరమయ్యారు. దీనికి కోటరీ కారణమని ఆయన చెప్పుకొచ్చారు. కానీ, జగన్‌పై ఎప్పుడూ విమర్శలు చేయకపోవడం గమనార్హం. అంటే.. జగన్‌పై ఆయనకు మంచి అభిప్రాయమే ఉంది. దీంతో జగనే స్వయంగా సాయిరెడ్డికి ఆహ్వానం పంపుతున్నారని విజయసాయి కూడా సానుకూలంగానే ఉన్నారని సమాచారం.
Andhra Pradesh news
Vijayasai Reddy
YSRCP
Politics
MP Resignation
Visakhapatnam
TDP
Internal Politics
Jagan Mohan Reddy
YSRCP Victory
Political Comeback
వైసీపీలోకి విజయసాయి రీ ఎంట్రీ
Scroll for the next article