News21st Aug 03:15 PMSunil Byrisetty1 min read
యువతిని కారుతో ఢీకొట్టిన కేసులో.. ఎంపీ కుమారుడు
కారుతో ఢీకొట్టి యువతి మృతికి కారణమైన జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 16న ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగిం
కారుతో ఢీకొట్టి యువతి మృతికి కారణమైన జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 16న ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒడిశాకు చెందిన భారతి ముఖి (26) తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. భారతి మాదాపూర్లో ఉంటూ ఇనార్బిట్ మాల్లోని ఓ స్టోర్లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తోంది. ఈ నెల 16న మధ్యాహ్నం స్నేహితురాలు పూజతో కలిసి ఐటీసీ కోహినూర్ వైపు భోజనం కోసం వెళ్లింది. భోజనం తీసుకుని తిరిగి ఇనార్బిట్ మాల్ వైపు రోడ్డు దాటుతుండగా.. మాదాపూర్ వైపు నుంచి వేగంగా వచ్చిన కారు భారతిని ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు నడిపింది సంజూష్గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు మాదాపూర్ ఇన్స్పెక్టర్ తెలిపారు.