Politics19th Oct 12:43 PMSunil Byrisetty1 min read
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేత ఈ మేరకు తేదీలు ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేత ఈ మేరకు తేదీలు ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 24న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 27వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 3న జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఈ నోటిఫికేషన్ 28 జిల్లాలకు చెందిన జిల్లా పరిషత్లు, 662 జెడ్పీటీసీ నియోజకవర్గాలు, 9,983 ఎంపీటీసీ నియోజకవర్గాలకు వర్తిస్తుంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్లను ప్రత్యక్ష ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు.