Politics7th Nov 01:12 PMSunil Byrisetty1 min read
ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ సందర్శించి పరిశ
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ సందర్శించి పరిశీలించారు. ముందుగా పెదకాకాని, ఫిరంగిపురం మండలాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులు, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. కౌంటింగ్ ఏజెంట్లతో మాట్లాడి లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో మీడియాతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని తెలిపారు. గుంటూరు జిల్లాలోని 13 మండలాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. నిబంధనల ప్రకారం తొలుత పోస్టల్ బ్యాలెట్లను తెరిచి లెక్కింపు చేపట్టినట్లు వివరించారు.