International5th Sep 12:12 PMSunil Byrisetty1 min read

మృత్యుంజయ మంత్రమే కాపాడింది

నేపాల్లో అద్భుతం చోటు చేసుకుంది. 9 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడిన మృత్యుంజయుడు వార్తల్లో నిలిచాడు. నేపాల్లోని త్రిశూల్ 3A టన్నెల్లో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను రెస్క్యూ బృందాలు

మృత్యుంజయ మంత్రమే కాపాడింది
నేపాల్లో అద్భుతం చోటు చేసుకుంది. 9 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడిన మృత్యుంజయుడు వార్తల్లో నిలిచాడు. నేపాల్లోని త్రిశూల్ 3A టన్నెల్లో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను రెస్క్యూ బృందాలు రక్షించాయి. ఆగస్టు 26న ఆకస్మిక వరదలు రావడంతో వారు అందులోనే చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతుండగా 9 రోజుల తర్వాత నేడు కబీర్ మహార్జన్, సంజయ్ షాలను ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. టన్నెల్ లోపలి నుంచి చాలా మంది గొంతులు వినిపిస్తుండగా వారినీ కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బయటపడిన కార్మికుడు శిథిలాల్లో ఉన్న 9 రోజులు మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ ఉన్నానని, ఆ దేవదేవుడే తనను కాపాడాడని చెప్పటం విశేషం.
Nepal Tunnel Rescue
Trishuli 3A Tunnel
Nepal Floods
Tunnel Accident
Rescue Operation
Kabir Maharjan
Sanjay Shah
కార్మికుల రక్షణ
9 రోజుల తర్వాత
మృత్యుంజయ మంత్రం
నేపాల్ వార్తలు
రెస్క్యూ బృందాలు
Scroll for the next article