News26th Oct 11:41 AMSunil Byrisetty1 min read
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ స్థాపనలో ఎంఎస్ఎస్ కృషి!
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ స్థాపనలో నాటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, దివంగత డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు చేసిన కృషిని మంగళగిరి నియోజకవర్గ ప్రజలు స్మరించుకుంటున్నారు. విశ్వవిద్యాలయం
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ స్థాపనలో నాటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, దివంగత డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు చేసిన కృషిని మంగళగిరి నియోజకవర్గ ప్రజలు స్మరించుకుంటున్నారు. విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా పంచుకున్న ప్రారంభోత్సవ చిత్రం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది.ఈ చిత్రంలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కోటేశ్వరరావు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న కాలంలోనే ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. దీని స్థాపనలో ఆయన చేసిన కృషిని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రంలో వైద్య విద్యాభివృద్ధికి ఆయన అందించిన సేవలను కొనియాడుతున్నారు.