TTD10th Nov 11:57 AMSunil Byrisetty1 min read

అంబానీ భారీ విరాళాలు.. తిరుమలకు రూ.100 కోట్లు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఒక్కరోజే మూడు ప్రముఖ ఆలయాలను సందర్శించి, ప్రజాసేవ కార్యక్రమాల కోసం భారీ విరాళాలు ప్రకటించారు. తిరుమల, కేరళలోని గురువాయూర్‌, రాజస్థాన్‌లోని

అంబానీ భారీ విరాళాలు.. తిరుమలకు రూ.100 కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఒక్కరోజే మూడు ప్రముఖ ఆలయాలను సందర్శించి, ప్రజాసేవ కార్యక్రమాల కోసం భారీ విరాళాలు ప్రకటించారు. తిరుమల, కేరళలోని గురువాయూర్‌, రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా ఆలయాలకు ఆయన రూ.165 కోట్లకు పైగా విరాళాలను ప్రకటించి వార్తల్లో నిలిచారు. ముఖేశ్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఈ సందర్భంగా తిరుమలలో నిత్యం 2 లక్షల మందికి అన్నప్రసాదాలు తయారు చేసేందుకు వీలుగా, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త శాటిలైట్ కిచెన్ (వంటశాల) నిర్మాణానికి రూ.100 కోట్లు విరాళంగా ప్రకటించారు. అనంతరం రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా ఆలయాన్ని సందర్శించారు. అక్కడ భక్తుల సౌకర్యార్థం యాత్రికుల సముదాయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. రానున్న మూడేళ్లలో పూర్తికానున్న ఈ ప్రాజెక్టు కోసం రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.15 కోట్లను విరాళంగా అందజేశారు. అలాగే కేరళలోని గురువాయూర్‌ శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి తనవంతు సహాయం ప్రకటించారు. తొలి విడతగా రూ.15 కోట్ల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు.
Andhra Pradesh
Mukesh Ambani
Tirumala Temple
Reliance Industries
Temple Donations
Guruvayur Temple
Nathdwara Temple
Tirupati
Ambani Donations
Tirumala Annadanam
శాటిలైట్ కిచెన్
భక్తుల సౌకర్యం
ఆలయ అభివృద్ధి
ప్రజాసేవ
Scroll for the next article