National2nd Oct 10:34 AMSunil Byrisetty1 min read
అంబానీ నం.1.. అదానీ నం.2!
మన దేశంలో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, రెండో స్థానంలో అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు. తాజాగా వెలువడిన ఎం3ఎం హురున్ ఇండియా సంపన్నుల జాబి
మన దేశంలో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, రెండో స్థానంలో అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు. తాజాగా వెలువడిన ఎం3ఎం హురున్ ఇండియా సంపన్నుల జాబితా-2025 ప్రకారం.. కుటుంబ సభ్యులతో కలిసి ముకేశ్ అంబానీ సంపద రూ.9.55 లక్షల కోట్లు కాగా, గౌతమ్ అదానీ సంపద రూ.8.15 లక్షల కోట్లుగా ఉంది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఛైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా మూడో స్థానంలో నిలవడమే కాకుండా మనదేశంలో అత్యంత ధనిక మహిళగా గుర్తింపు సాధించారు. మన దేశంలో ధనికుల సంఖ్య పెరిగిపోతున్నట్లు ఈ జాబితా చూస్తే స్పష్టమవుతోంది. బిలియనీర్ల సంఖ్య (రూ.8,800 కోట్లకు మించి ఆస్తి కలిగిన వారు) 350కు మించింది. హురున్ ఇండియా ధనికుల తొలి జాబితా 13 ఏళ్ల క్రితం విడుదల అయింది. అప్పట్లో బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాదితో పోలిస్తే 6వ వంతే. తాజా జాబితా ప్రకారం ప్రస్తుత బిలియనీర్లందరి సంపద విలువ కలిసి రూ.167 లక్షల కోట్లకు చేరింది. ఇది మనదేశ జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి)లో దాదాపు సగానికి సమానం.