News22nd May 11:56 AMSunil Byrisetty1 min read
సెప్టెంబర్ 30 నాటికి నాటుసారా రహితంగా ఆంధ్రా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాటుసారా నుంచి పూర్తిగా విముక్తం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. నవోదయం 2.0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాటుసారా నుంచి పూర్తిగా విముక్తం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
నవోదయం 2.0 కార్యక్రమం అమలులో భాగంగా మంగళగిరిలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మీనా ఎక్సైజ్ అధికారులకు కీలక సూచనలు చేశారు.
సెప్టెంబర్ 30 నాటికి రాష్ట్రం మొత్తాన్ని నాటు సారా రహితంగా మార్చాలని తుదిగడువు విధించారు.
అధికారులు తక్షణ చర్యలకు దిగాలని ఆదేశించారు.
కాకినాడ, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో గత అనుభవాల ఆధారంగా ప్రత్యేక వ్యూహాలు రూపొందించి అమలు చేయాలని సూచించారు.
రూ.99 మద్యం బ్రాండ్లు ప్రవేశపెట్టడం వల్ల కట్టడి పక్కాగా జరిగిందని ఆయన పేర్కొన్నారు.
శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను సమీక్షించారు