News29th Jun 12:52 PMSunil Byrisetty1 min read
ప్రతి నియోజకవర్గంలో ఓ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి
రాష్ట్రంలో పెరుగుతున్న ఆరోగ్య అవసరాలను తీర్చేలా కొత్త ఆసుపత్రులను నిర్మించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ 100 నుంచి 300
రాష్ట్రంలో పెరుగుతున్న ఆరోగ్య అవసరాలను తీర్చేలా కొత్త ఆసుపత్రులను నిర్మించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ 100 నుంచి 300 పడకల స్థాయి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో 100 పడకల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో 3,300 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల ఏర్పాటుకు కేంద్రం రూ.1,095 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి 8 నుంచి 14% దాకా పెరిగిందన్నారు. తద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుతాయని తెలిపారు.