Telangana28th Aug 09:59 AMSunil Byrisetty1 min read
అర్దరాత్రి ముంపు ప్రాంతాల్లో ఎస్పీ డా. శబరిష్
ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా ఎస్పీ డా. శబరీష్. పి సూచనలు జారీ చేశారు. భారీ వర్షాలకు ప్రాజెక్ట్ నగర్ సమీపంలోని వాగు ఉదృ
ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా ఎస్పీ డా. శబరీష్. పి సూచనలు జారీ చేశారు. భారీ వర్షాలకు ప్రాజెక్ట్ నగర్ సమీపంలోని వాగు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలను పునరావస కేంద్రానికి తరలించారు. ఈ పునరావాస కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సందర్శించి, వారితో మాట్లాడుతూ ప్రజలంతా వర్షాలు తగ్గేవరకు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని వాళ్లలో ధైర్యం నింపారు. అదేవిధంగా జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తాన్ని అప్రమత్తం చేస్తూ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చిన ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. పసర నుంచి తాడ్వాయి మధ్యలో మండల తోగు వద్ద జలగలంచ వాగు ఉదృతంగా రోడ్డు మీద నుంచి ప్రవహిస్తుంది. ఎస్పి వాగును సందర్శించి వరద ఉధృతి తగ్గే వరకు వాహనాల రాకపోకలను నిషేధించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.