International14th Apr 12:24 PMSunil Byrisetty1 min read

సముద్రగర్భంలో రైలు.. ముంబై టూ దుబాయ్ రెండు గంటల్లో!

అరేబియా సముద్రం అంతర్భాగంలో రైలు మార్గం రాబోతోంది. భారతదేశంలోని ముంబై నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (దుబాయ్) మధ్య హై స్పీడ్ రైలు మార్గాన్ని నిర్మించబోతున్నారు. సముద్రం అడుగున 2,000

సముద్రగర్భంలో రైలు.. ముంబై టూ దుబాయ్ రెండు గంటల్లో!
అరేబియా సముద్రం అంతర్భాగంలో రైలు మార్గం రాబోతోంది. భారతదేశంలోని ముంబై నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (దుబాయ్) మధ్య హై స్పీడ్ రైలు మార్గాన్ని నిర్మించబోతున్నారు. సముద్రం అడుగున 2,000 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాన్ని నిర్మించే అత్యాధునిక ప్రాజెక్ట్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దుబాయ్‌కి చెందిన నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సారథ్యం వహిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం రెండు గంటలకు తగ్గిపోనుంది. హైపర్‌లూప్ వ్యవస్థను పోలిన అధునాతన సాంకేతికతతో ఈ మార్గం ఉండనుంది. గంటకు 600 నుంచి 1,000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ రైలు విమాన ప్రయాణానికి సమాంతరంగా ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.
Mumbai
Dubai
Train
Underwater
Rail
Network
అరేబియా సముద్రం అంతర్భాగంలో రైలు మార్గం
హైపర్‌లూప్ వ్యవస్థ
హై స్పీడ్ రైలు
Scroll for the next article