News3rd Nov 12:59 PMSunil Byrisetty1 min read
ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు
తిరుపతి జిల్లాలోని నాలుగు పురపాలక సంస్థలు సూళ్లూరుపేట, నాయుడుపేట, పుత్తూరు, వెంకటగిరితో పాటు తిరుపతి నగరపాలక సంస్థలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొ
తిరుపతి జిల్లాలోని నాలుగు పురపాలక సంస్థలు సూళ్లూరుపేట, నాయుడుపేట, పుత్తూరు, వెంకటగిరితో పాటు తిరుపతి నగరపాలక సంస్థలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, మున్సిపల్ కమిషనర్ ఎం. జయకృష్ణతో కలిసి పరిశీలించారు. ఇప్పటివరకు అన్ని కేంద్రాల్లో మేయర్/చైర్‌పర్సన్, వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాల వర్గీకరణ (సెగ్రిగేషన్) ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ మినహా మిగిలిన నాలుగు పురపాలక సంస్థల్లో వార్డుల వారీగా ఓట్ల లెక్కింపుతో పాటు మేయర్/చైర్‌పర్సన్ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కూడా వివిధ రౌండ్లలో కొనసాగుతోందని తెలిపారు. వెంకటగిరి, పుత్తూరు పురపాలక సంస్థల ఫలితాలు మరో గంటలోపు పూర్తిస్థాయిలో వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. నాయుడుపేట, సూళ్లూరుపేట పురపాలక సంస్థల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటలలోపు పూర్తయ్యే అవకాశం ఉందని, తిరుపతి నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం 7 గంటలలోపు పూర్తవుతుందన్నారు.