News17th Jul 09:51 AMSunil Byrisetty1 min read

ఢిల్లీలో మంత్రి నారాయణ.. అవార్డుల పంట!

ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఉదయం 11 గంటలకు విజ్ఞాన్ భవన్ లో జరిగే స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రంలో ఐదు నగరాలు

ఢిల్లీలో మంత్రి నారాయణ.. అవార్డుల పంట!
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఉదయం 11 గంటలకు విజ్ఞాన్ భవన్ లో జరిగే స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రంలో ఐదు నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులకు ఎంపిక కావడంతో అవి అందుకునేందుకు ఢిల్లీ వెళ్లారు. విశాఖ జీవీఎంసీ, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్లకు అవార్డులు లభించాయి. ఆయా కార్పొరేషన్ల కమిషనర్లతో కలిసి మంత్రి నారాయణ అవార్డులు అందుకోనున్నారు. అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ హాజరవుతున్నారు. అనంతరం మధ్యాహ్నం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ అధ్యక్షతన జరిగే అన్ని రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖల మంత్రుల సమావేశానికి మంత్రి నారాయణ హాజరు కానున్నారు.
Andhra Pradesh news
Delhi
swachh survekshan Awards
swachh bharatabhiya
PM Modi Guntur
president droupadi murmu
minister narayana
స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు
Scroll for the next article