News18th May 04:23 PMSunil Byrisetty1 min read
మ్యూజియాలు మన నాగరికతకు దర్పణాలు
సంస్కృతి, చారిత్రక సంపద పరిరక్షణలో మ్యూజియాల పాత్ర విశిష్టమైనదని.. అవి మన నాగరికతకు దర్పణాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. అంతర్జాతీయ మ్యూజియం ది
సంస్కృతి, చారిత్రక సంపద పరిరక్షణలో మ్యూజియాల పాత్ర విశిష్టమైనదని.. అవి మన నాగరికతకు దర్పణాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ.. ఆర్కియాలజీ, రెవెన్యూ, పర్యాటకం, పట్టణ పరిపాలన తదితర శాఖల అధికారులు, అడ్వెంచర్, టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ల ప్రతినిధులతో కలిసి కొండపల్లి కోటలోని మ్యూజియంను సందర్శించారు.
కొండపల్లి బొమ్మల కళాకారుల వీధి నుంచి ఖిల్లాకు ట్రెక్కింగ్ చేశారు.
కొండపల్లి ఖిల్లా ప్రాంత గొప్ప వారసత్వ పరిరక్షణపై నిబద్ధతను చాటిచెప్పే లక్ష్యంతో ఈ పర్యటన చేయడం జరిగింది.
కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ వేగంగా మారుతున్న సమాజాల్లో మ్యూజియాల భవిష్యత్తు అనే ఇతివృత్తంతో ఈ ఏడాది అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని.. ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా, చారిత్రక వారసత్వాన్ని కాపాడుతూ మ్యూజియాల అభివృద్ధి చెందుతున్న తీరుకు ఇది అద్దంపడుతుందని పేర్కొన్నారు.
చారిత్రక ఔన్నత్యాన్ని కళ్ల ముందుంచే సజీవ తరగతిగదులైన మ్యూజియాలను ప్రజలు ముఖ్యంగా యువత, విద్యార్థులు సందర్శించాలని.. విజయవాడలోని బాపూ మ్యూజియం, కొండపల్లికోటలోని మ్యూజియం వంటివాటిని