News24th Dec 11:08 AMSunil Byrisetty1 min read
సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు
సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కళాకారుల ద్వారా అన్నమయ్య కీర్తలను ప్రజలకు చేరువ చేస్తున్న డా. శోభారాజు కార్యక్రమాలకు తమ సహకారం ఎప
సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కళాకారుల ద్వారా అన్నమయ్య కీర్తలను ప్రజలకు చేరువ చేస్తున్న డా. శోభారాజు కార్యక్రమాలకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. అన్నమయ్య అంతర్జాతీయ సంకీర్తన పోటీలు ''తందనానా - 2025''లో విజేతలైన ముగ్గురు గాయనీ గాయకులకు ముఖ్యమంత్రి బంగారు పతకాలను బహుకరించారు. సబ్ జూనియర్ విభాగంలో భట్టిప్రోలు మేఘన, జూనియర్ విభాగంలో చిర్పల్లి శ్రీమహాలక్ష్మి, సీనియర్ విభాగంలో సముద్రాల లక్ష్మీ హరిచందన సీఎం చేతుల మీదుగా బంగారు పతకాలను అందుకున్నారు. "సంగీతం, సాహిత్యం, సంస్కృతులే విలువలు నేర్పే సాధనాలు...భారతీయ మూలాలు. భారతీయ సంగీతంతో భక్తి ఉద్యమానికి ప్రాణం పోసిన మహానుభావుడు తాళ్లపాక అన్నమాచార్యులు. 32 వేల సంకీర్తనలు రచించారు. అన్నమయ్య సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేసేందుకు గత 42 ఏళ్లుగా కృషి చేస్తున్న అన్నమాచార్య భావనా వాహిని సంస్థను అభినందిస్తున్నా"అని ముఖ్యమంత్రి చెప్పారు.