Telangana7th Sep 10:22 AMSunil Byrisetty1 min read

గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ

తెలంగాణలోని నిర్మల్ పట్టణంలో మతసామరస్యం వెల్లివిరిసింది. వేలంలో గణేశ్ లడ్డూను ముస్లిం మహిళ దక్కించుకుంది. ఈద్గాం ఆదర్శ నగర్ గణపతి లడ్డూ వేలంలో అమ్రీన్ అనే ముస్లిం మహిళ పాల్గొన్నారు

గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ
తెలంగాణలోని నిర్మల్ పట్టణంలో మతసామరస్యం వెల్లివిరిసింది. వేలంలో గణేశ్ లడ్డూను ముస్లిం మహిళ దక్కించుకుంది. ఈద్గాం ఆదర్శ నగర్ గణపతి లడ్డూ వేలంలో అమ్రీన్ అనే ముస్లిం మహిళ పాల్గొన్నారు. రూ. 1,88,888కి లడ్డూను దక్కించుకున్నారు. ముస్లిం మహిళ హిందూ పండుగలో భాగస్వామి కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందని అమ్రీన్ తెలిపారు. అటు నారాయణపేట(డి) ముష్టిపల్లిలో ఎండీ పాషా అనే ముస్లిం వ్యక్తి రూ.26,116కు లడ్డూను దక్కించుకున్నారు.
Telangana
Ganesh Festival
Ganesh Laddu Auction
Communal Harmony
Nirmal
Narayanpet
Unity In Diversity
Ganesh Chaturthi
వేలం పాట
సాంస్కృతిక ఐక్యత
ఉమ్మడి పండుగలు
Scroll for the next article