News6th Sep 03:25 PMSunil Byrisetty1 min read
గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా సుబ్బయ్య
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్, డైరెక్టర్‌గా బీజేపీ సీనియర్ నాయకులు మువ్వల వెంకట రామ సుబ్బారావు(సుబ్బయ్య)ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్, డైరెక్టర్‌గా బీజేపీ సీనియర్ నాయకులు మువ్వల వెంకట రామ సుబ్బారావు(సుబ్బయ్య)ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీలో పేర్కొంది. సుబ్బయ్యను ఎన్నిక చేయడంపై రాష్ట్ర బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తనను కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించడంపై ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్‌లకు సుబ్బయ్య కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీలో సాధారణ కార్యకర్తగా సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న సుబ్బయ్యకు సముచిత ప్రాధాన్యం లభించిందని పార్టీ నేతలు చెబుతున్నారు.