News16th Jan 10:59 AMSunil Byrisetty1 min read

సంక్రాంతి విన్న‌ర్ గా నారీ నారీ న‌డుము మురారీ

లో బడ్జెట్‌లో తెర‌కెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధించ‌టం తెలుగు చిత్ర సీమ‌కు శుభ‌ప‌రిణామమ‌ని, చిన్న సినిమాలు విజ‌యం సాధించ‌టం వ‌ల్ల మూవీ ఇండ‌స్ట్రీలో ఎంతో మంది స్పూర్తి

సంక్రాంతి విన్న‌ర్ గా నారీ నారీ న‌డుము మురారీ
లో బడ్జెట్‌లో తెర‌కెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధించ‌టం తెలుగు చిత్ర సీమ‌కు శుభ‌ప‌రిణామమ‌ని, చిన్న సినిమాలు విజ‌యం సాధించ‌టం వ‌ల్ల మూవీ ఇండ‌స్ట్రీలో ఎంతో మంది స్పూర్తి పొందుతార‌ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. సంక్రాంతి సందర్భంగా విడుద‌లైన ఎ.కె.ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్స్ పై నిర్మాత అనిల్ సుంక‌ర్ నిర్మించగా, డైర‌క్ట‌ర్ రామ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన నారీ నారీ న‌డుమ మురారీ మూవీ స‌క్సెస్ మీట్ విజయవాడలో జ‌రిగింది. నిర్మాత అనిల్ సుంక‌ర‌, డైరెక్ట‌ర్ రామ అబ్బ‌రాజు నిర్వ‌హించిన స‌క్సెస్ మీట్ కి ముఖ్యఅతిథిగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ హాజ‌ర‌య్యారు. గతంలో బాలకృష్ణ నటించిన ‘నారీ నారీ నడుమ మురారీ’ బ్లాక్‌బస్టర్ హిట్ కాగా, అదే టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం కూడా సక్సెస్ సాధించిందన్నారు. చిత్రసీమ బాగుండాలంటే మరిన్ని చిన్న సినిమాలు రావాలని, అవి కూడా విజయాలు సాధించాలని కోరుకున్నారు.
Sankranti Releases
Naari Naari Naduma Murari
Box Office Success
Telugu Cinema
Low Budget Films
Movie Industry
Vijayawada
అనిల్ సుంకర్
రామ అబ్బరాజు
సక్సెస్ మీట్
సినిమా పరిశ్రమ
స్పూర్తి
Scroll for the next article