Politics24th Jan 02:43 PMSunil Byrisetty1 min read
జోగి రమేష్ ఒక మానసిక రోగి!?
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లకు సవాళ్లు విసిరే స్థాయి జోగి రమేష్ కి లేదని కమ్మ కార్పోరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి అన్నారు. నకిలీ మద్యం కేసులో బెయిల్ పై విడుదల
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లకు సవాళ్లు విసిరే స్థాయి జోగి రమేష్ కి లేదని కమ్మ కార్పోరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి అన్నారు. నకిలీ మద్యం కేసులో బెయిల్ పై విడుదలైన జోగి రమేష్.. చంద్రబాబు, లోకేష్ లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలన్న ఉద్దేశంతో జోగి రమేష్ పన్నిన నకిలీ మద్యం కుట్ర ఘటనలో అతను అడ్డంగా దొరికాడని, ఇప్పుడు మీడియా ముందు ఎన్ని అబద్ధాలు చెప్పినా జనం నమ్మే స్థితిలో లేరన్నారు. జోగి రమేష్ ఎప్పుడూ ఒక మానసిక రోగిలా ప్రవర్తిస్తాడని ఇందుకు గతంలో చంద్రబాబు ఇంటి పైకి దాడికి వెళ్లడమే నిదర్శనమన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన కోసం పెట్టుబడుల నిమిత్తం దావోస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ అవిశ్రాంతంగా కృషి చేస్తుంటే సిగ్గు లేకుండా విమర్శలు చేయడం జోగి రమేష్ బుద్ధి తక్కువ తనానికి నిదర్శనమన్నారు. చేసిన తప్పుడు పనుల్లో అడ్డంగా దొరికి ఇప్పుడు ప్రమాణాలు చేస్తాను అని సవాలు విసరడం హాస్యాస్పదమన్నారు.