News13th May 11:34 AMSunil Byrisetty1 min read
ఆపరేషన్ సిందూర్‌తో శత్రుదేశానికి గుణపాఠం!
ఆపరేషన్ సిందూర్ ద్వారా శత్రుదేశానికి తగు గుణపాఠం చెప్పామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడలోని శ్రీ కనక దుర్గమ్మ వారిని మంత్రి మనోహర్, శాసన మండల
ఆపరేషన్ సిందూర్ ద్వారా శత్రుదేశానికి తగు గుణపాఠం చెప్పామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
విజయవాడలోని శ్రీ కనక దుర్గమ్మ వారిని మంత్రి మనోహర్, శాసన మండలి సభ్యులు హరి ప్రసాద్, వివిధ కార్పొరేషన్ చైర్మన్‌లతో సహా విచ్చేసి దర్శించుకున్నారు.
ఆపరేషన్ సిందూర్ ద్వారా శత్రుదేశానికి మన బలమేంటో చాటి చెప్పామన్నారు.
దేశ నాయకత్వం, సైన్యానికి దైవ బలం మెండుగా ఉండాలని దుర్గమ్మను వేడుకున్నారు.
ఇంద్రకీలాద్రికి విచ్చేసిన వీరిని ఆలయ కార్యనిర్వాహణాధికారి వి. కె.శీనానాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం,చిత్రపటం ప్రసాదములను అందించారు.