News28th Jul 12:23 PMSunil Byrisetty1 min read

ప్రజా పంపిణీ ద్వారా ప్రజలకు స్టీమ్ రైస్

ప్రజాపంపిణీ వ్యవస్థలో ప్రజలకు స్టీమ్ రైస్ అందించడం ద్వారా వారికి పౌర సరఫరాల శాఖ సేవలను మరింత చేరువ చేయొచ్చు. దీనిద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యం అందడంతో పాటు, బియ్యం అక్రమ రవాణా నిర

ప్రజా పంపిణీ ద్వారా ప్రజలకు స్టీమ్ రైస్
ప్రజాపంపిణీ వ్యవస్థలో ప్రజలకు స్టీమ్ రైస్ అందించడం ద్వారా వారికి పౌర సరఫరాల శాఖ సేవలను మరింత చేరువ చేయొచ్చు. దీనిద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యం అందడంతో పాటు, బియ్యం అక్రమ రవాణా నిరోధానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి కేంద్ర పౌర సరఫరాల శాఖ సహకారం ఎంతో అవసరం అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఢిల్లీలో కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు శాఖ ఉన్నతాధికారులను కలిశారు. నేషనల్ కోఆపరేటివ్ కన్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్సీసీఫ్) ఎండీ అనీస్ జోసఫ్ ని కలిసి రాష్ట్రంలో 1000 ‘‘మీమార్టు’’ ల ఏర్పాటుపై తగిన సహకారం కోరుతూ ఎంఓయూ చేసుకున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే అంశాలపై చర్చించారు. సీఎంఆర్ సేకరణ, స్టీమ్ రైస్ పంపిణీ, మీ మార్టుల ప్రారంభం, రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతులు వంటి అనేక అంశాలను చర్చించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 ప్రత్యేక పాయింట్ల ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయాలను చేపడుతున్నవిషయాన్ని కేంద్ర మంత్రి వద్ద మనోహర్ ప్రస్తావించారు.
Andhra Pradesh
Nadendla Manohar
Prahlad Joshi
Public Distribution System
PDS
Steam Rice
Civil Supplies Department
బియ్యం పంపిణీ
ఆహార భద్రత
ఏపీ ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం
Scroll for the next article