Politics18th Jul 09:23 AMSunil Byrisetty1 min read
ఆ ఫార్ములా స్థానికంలో పని చేయదు!
కూటమి పొత్తుపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోజు ఓటు చీలనివ్వనని ఇచ్చిన మాట కోసం పవన్ కళ్యాణ్ నిలబడ్డారని గుర్తు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రం కోసం వ
కూటమి పొత్తుపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోజు ఓటు చీలనివ్వనని ఇచ్చిన మాట కోసం పవన్ కళ్యాణ్ నిలబడ్డారని గుర్తు చేశారు.
2024 సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రం కోసం వెనక్కి తగ్గామన్నారు. అలా అని
స్దానిక సంస్థల ఎన్నికలలో కూడా వెనక్కి తగ్గుతాం అనుకుంటే పొరబాటు అని స్పష్టం చేశారు.
సార్వత్రిక ఎన్నికల ఫార్ములా ఇప్పడు వర్తించదని తేల్చి చెప్పారు. జనసేనలో కష్టపడి పనిచేసిన వారికి స్దానిక సంస్థలలో అవకాశం ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.