Spiritual6th Nov 11:18 AMSunil Byrisetty1 min read

మహాశివుడికి నాగసాధువుల అభిషేకం

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో మట్టి శివలింగంకు కార్తీ మాసం సందర్భంగా నాగ సాధువులతో వివిధ రకాల జలాలతో, పండ్లతో, భస్మంతో, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. నాగ సాధు

మహాశివుడికి నాగసాధువుల అభిషేకం
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో మట్టి శివలింగంకు కార్తీ మాసం సందర్భంగా నాగ సాధువులతో వివిధ రకాల జలాలతో, పండ్లతో, భస్మంతో, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. నాగ సాధువుల రాకతో ఆ ప్రాంతం అంత శివనామస్మరణతో మారుమోగింది. మేకా వెంకట శివారెడ్డి స్వామి సంకల్పంతో సుమారు 40 మంది నాగసాదువులు, వాయిద్యాలతో 50 నిమిషాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని హారహార హారహార నామంతో ప్రాంగణం మారుమోగిపోయింది. అనంతరం మేకా వెంకట శివారెడ్డి స్వామి 18 వ పడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వార్లను దర్శించుకున్నారు. మేకా వెంకట శివారెడ్డి స్వామి వచ్చిన భక్తులకు పలహార ఏర్పాట్లు చేశారు.
Andhra Pradesh
Lord Shiva
Nag Sadhus
Karthika Masam
Abhishekam
Guntur
Tadepalli
Penumaka
హిందూ ఆచారాలు
భక్తి
ఆధ్యాత్మిక కార్యక్రమం
శివలింగం
ధార్మిక వేడుక
Scroll for the next article