Politics19th Jul 03:15 PMSunil Byrisetty1 min read
కేంద్ర మంత్రివర్గంలోకి నాగబాబు?
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబును కేంద్రంలోకి పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. త్వరలో కేంద్ర మంత్ర
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబును కేంద్రంలోకి పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కేంద్ర మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అంటున్నారు. విస్తరణలో ఏపీకి ఇంకో రెండు బెర్తులు దక్కే అవకాశం ఉందట. అందులో ఒకటి జనసేనకు ఫిక్స్ చేయగా.. నాగబాబు ఆ కోటాలో కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తారని ప్రచారం వినిపిస్తోంది. మరో సీటు టీడీపీకి ఇస్తారని చెబుతున్నారు. అయితే ఏపీలో ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు కేంద్రానికి వెళ్లాలంటే తన పదవికి రాజీనామా చేసి, రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావాల్సి ఉంది.