Celebrity Family24th Jun 04:13 PMSunil Byrisetty1 min read
అమ్మ ఆరోగ్యం బాగుందన్న నాగబాబు
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని వార్తలొస్తున్న విషయం తెలిసిందే. దీంతో మెగా అభిమానులు ఆందోళన చెందగా దీనిపై మెగా బ్రదర్, MLC నాగబాబు క్లారిటీ ఇచ్చారు. 'అమ్మ
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని వార్తలొస్తున్న విషయం తెలిసిందే. దీంతో మెగా అభిమానులు ఆందోళన చెందగా దీనిపై మెగా బ్రదర్, MLC నాగబాబు క్లారిటీ ఇచ్చారు. 'అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారు' అని ఆయన Xలో రాసుకొచ్చారు. ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని పేర్కొన్నారు. మరోవైపు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన తల్లి ఆరోగ్యం బాలేదని తెలియగానే క్యాబినెట్ నుంచి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానుల్లో ఉన్న ఆందోళన పోగొట్టేలా నాగబాబు ట్వీట్ చేశారు.