Politics7th Mar 03:26 PMSunil Byrisetty1 min read
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్
నటుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదల నాగబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్
నటుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదల నాగబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు బలపరిచారు.
నాగబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, పల్లాశ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.
రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలు కొణిదలనాగబాబు అందచేశారు.
గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న నాగబాబును తొలుత రాజ్యసభకు పంపాలని భావించినా, ఎమ్మెల్సీలు ఖాళీ కావడంతో పవన్ కల్యాణ్ ఎమ్మెల్సీగా పంపుతున్నారు. అలాగే మంత్రి పదవినీ కేటాయిస్తారని సమాచారం.