Politics2nd Apr 03:47 PMSunil Byrisetty1 min read
నలుగురితో ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి ఐదుగురు శాసన మండలి సభ్యులు ఎంపికైన విషయం తెలిసిందే. బీజేపీ నుంచి సోము వీర్రాజు ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి బీటీ నాయుడు, పేరాబత్తుల రాజశేఖర్,
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి ఐదుగురు శాసన మండలి సభ్యులు ఎంపికైన విషయం తెలిసిందే.
బీజేపీ నుంచి సోము వీర్రాజు ఎన్నికయ్యారు.
టీడీపీ నుంచి బీటీ నాయుడు, పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక కాగా, జనసేన నుంచి కొణిదల నాగేంద్ర రావు(నాగబాబు) ఎన్నికయ్యారు.
వీరందరూ బుధవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని చైర్మన్ చాంబరులో ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు సభ్యులచే శాసన మండలి సభ్యులుగా ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కె. అచ్చన్నాయుడు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్, ఉప కార్యదర్శి రాజ్ కుమార్, ఇతర అధికారులు, పలువురు ఎంఎల్ఏలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడైన నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.