Politics3rd Apr 03:05 PMSunil Byrisetty1 min read
ఎమ్మెల్సీ అయ్యాక నాగబాబు తొలి పర్యటన అక్కడే!
ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రమాణ స్వీకరాం చేశాక తొలిసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. తన సోదరుడు పవన్ ఎమ్
ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రమాణ స్వీకరాం చేశాక తొలిసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. తన సోదరుడు పవన్ ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురంలో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 4, 5 తేదీల్లో పిఠాపురంలో నాగబాబు పర్యటన జరగనుంది.
పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతన నిర్మాణాలను నాగబాబు ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమాల్లో శాసన మండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ కుమార్, పిఠాపురం ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్ హాజరు కానున్నారు.
గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా నాగబాబు పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.