Politics29th Oct 05:37 PMSunil Byrisetty1 min read
ఎన్నికల సిబ్బంది ఓటుకు ఏర్పాట్లు
విజయవాడలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని జిల్లా స్థానిక సంస్థల సాధారణ పరిశీలకురాలు నాగలక్ష్మి.ఎస్ తనిఖీ చేశా
విజయవాడలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని జిల్లా స్థానిక సంస్థల సాధారణ పరిశీలకురాలు నాగలక్ష్మి.ఎస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఓటర్ల నమోదు, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, బ్యాలెట్ బాక్సుల భద్రత, సిబ్బంది సౌకర్యాల కల్పన తదితర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, నిబంధనల ప్రకారం జరగాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రం వద్ద భద్రతను సమీక్షించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు స్ట్రాంగ్ రూమ్‌లు, బ్యాలెట్ పెట్టెలకు కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా ఉండాలని సూచించారు. ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.