News17th Dec 11:58 AMSunil Byrisetty1 min read

ANR కళాశాలకు రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన నాగార్జున

గుడివాడలో అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్ఆర్) కళాశాల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న సినీ హీరో అక్కినేని నాగా

ANR కళాశాలకు రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన నాగార్జున
గుడివాడలో అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్ఆర్) కళాశాల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న సినీ హీరో అక్కినేని నాగార్జున, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ బట్టు దేవానంద్, గుడివాడ,పామర్రు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము,వర్ల కుమార్ రాజా అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం నాగార్జున రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. నాగార్జున మాట్లాడుతూ.. ‘మా తండ్రి నాగేశ్వరరావు చదువుకోకపోయినా.. ఆయనకు చదువు అంటే చాలా ఇష్టమని గుర్తు చేసుకున్నారు. అందుకే వేల మందికి బంగారు భవిష్యత్తు ఇచ్చేలా కృషి చేశారన్నారు. 1959లో ఏఎన్నార్‌ కళాశాలకు నాగేశ్వరరావు రూ.లక్ష విరాళం అందించారు’ అని నాగార్జున గుర్తుచేశారు.
Andhra Pradesh
Nagarjuna
Akkineni Nageswara Rao College
ANR College
Gudivada
Diamond Jubilee Celebrations
Education Donation
తెలుగు సినిమా
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఉన్నత విద్య
Scroll for the next article