Entertainment13th Jun 05:03 PMSunil Byrisetty1 min read
2 సినిమాలపై అప్డేట్ ఇచ్చిన నాగార్జున
నటసామ్రాట్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న రెండు చిత్రాలు 'కుబేర', 'కూలీ'లపై అప్డేట్ ఇచ్చారు. ఈ రెండు సినిమాల్లోని పాత్రలు పూర్తి భిన్నంగా ఉంటాయని స్పష్టం చేశారు. సూపర్ స్
నటసామ్రాట్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న రెండు చిత్రాలు 'కుబేర', 'కూలీ'లపై అప్డేట్ ఇచ్చారు. ఈ రెండు సినిమాల్లోని పాత్రలు పూర్తి భిన్నంగా ఉంటాయని స్పష్టం చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కూలీ'లో తన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలిపారు. 'కూలీ'లో కూడా ప్రతి పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుందన్నారు.ఇక ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో, జాతీయ అవార్డు గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'కుబేర' చిత్రం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "శేఖర్ కమ్ముల తెలుగు ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన దర్శకుల్లో ఒకరు. 'కుబేర' కథతో శేఖర్ తన వద్దకు వచ్చినప్పుడు, శేఖర్, నువ్వు నిజంగానే ఈ సినిమా చేయాలనుకుంటున్నావా?" అని ప్రశ్నించానని గుర్తుచేసుకున్నారు. ఈ రెండు చిత్రాలు తన కెరీర్‌లో వైవిధ్యమైనవిగా నిలుస్తాయని నాగార్జున పేర్కొన్నారు.