Entertainment3rd Jun 03:07 PMSunil Byrisetty1 min read

సీఎం చంద్రబాబును కలిసిన నాగార్జున

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సినీ హీరో అక్కినేని నాగార్జున ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో కలిశారు. తన చిన్న కుమారుడు అఖిల్ వివాహ ఆహ్వాన పత్రికను సీఎం చంద్రబాబుకు నాగార్జున

సీఎం చంద్రబాబును కలిసిన నాగార్జున
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సినీ హీరో అక్కినేని నాగార్జున ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో కలిశారు. తన చిన్న కుమారుడు అఖిల్ వివాహ ఆహ్వాన పత్రికను సీఎం చంద్రబాబుకు నాగార్జున అందించారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నాగార్జున దంపతులు కలిశారు. రేవంత్ రెడ్డి దంపతులను నాగార్జున, అమల కలిసి తమ కుమారుడి వివాహానికి హాజరు కావాలని కోరారు. అలాగే పలువురు ప్రముఖులను, రాజకీయ నాయకులు, సినీ నటులను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు.
Andhra Pradesh news
cmchandrababu
nagarjuna
Invites For Akhils Marriage
చంద్రబాబుకు వివాహ ఆహ్వాన పత్రికను అందించిన నాగార్జున
Scroll for the next article