Entertainment15th Aug 11:03 AMSunil Byrisetty1 min read
ఆ అటాక్ చాలా నేర్పింది!
టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున సైబర్ పాఠాలు నేర్చుకున్నారు. ఆ మధ్య తమ కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్ కు గురయ్యారని ఇటీవల వెల్లడించారు. తాజాగా ఈరోజు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్య
టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున సైబర్ పాఠాలు నేర్చుకున్నారు. ఆ మధ్య తమ కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్ కు గురయ్యారని ఇటీవల వెల్లడించారు. తాజాగా ఈరోజు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను కూడా సైబర్ కేటుగాళ్లు ఫోన్ బ్యాంక్ అధికారులం అంటూ నమ్మించి మోసం చేసారని.. నాలుగేళ్ల క్రితం ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ సైబర్ అటాక్ తనకు చాలా నేర్పిందని, తరచుగా పాస్ వర్డ్ మార్చాలని తెలిసిందని పేర్కొన్నారు.