Jobs30th Oct 03:32 PMSunil Byrisetty1 min read

యువతకు ఉద్యోగాల గేట్ వేగా ‘నైపుణ్యం’ పోర్టల్

యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే, వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎద

యువతకు ఉద్యోగాల గేట్ వేగా ‘నైపుణ్యం’ పోర్టల్
యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే, వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూసే వారి కోసం రూపొందించిన ‘నైపుణ్యం’ పోర్టల్ ఉద్యోగాల గేట్ వేగా ఉండాలని అధికారులకు సూచించారు. 2029 కల్లా 20 లక్షలు ఉద్యోగాలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసేలా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇకపై ప్రతీ నెలా, ప్రతీ నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నవంబర్‌లో జరిగే భాగస్వామ్య సదస్సులోగా ‘నైపుణ్యం’ పోర్టల్ ప్రారంభించి, అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన వారికి ఇక నుంచి అధికారికంగా ధ్రువపత్రాలు జారీ చేయాలన్నారు. గురువారం సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్‌తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. నైపుణ్యం పోర్టల్, జాబ్ డ్యాష్ బోర్డ్, వివిధ కోర్సులు, ఉద్యోగావకాశాలు తదితర అంశాల గురించి సమీక్షలో చర్చించారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Naipunyam Portal
Youth Employment
Skill Development
నారా లోకేష్
జాబ్ మేళా
విద్యా సహాయం
శిక్షణ
ఏపీ ప్రభుత్వం
Scroll for the next article