Politics8th Jul 02:50 PMSunil Byrisetty1 min read
మహిళా లోకానికి నల్లపురెడ్డి క్షమాపణ చెప్పాలి
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మహిళా లోకానికి వెంటనే క్షమాపణ చెప్పాలని లిడ్ క్యాప్ చైర్మన్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పని పక
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మహిళా లోకానికి వెంటనే క్షమాపణ చెప్పాలని లిడ్ క్యాప్ చైర్మన్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పని పక్షంలో పోలీసులు అతన్ని అరెస్టు చేయాలన్నారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకులను శత్రువులుగా భావించి బూతు పురాణాలను మాట్లాడుతుంటారని వ్యాఖ్యానించారు. ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి చేసిన దారుణమైన వ్యాఖ్యలను సమర్ధించుకోవడం వైసిపి బరితెగింపుకు నిదర్శనమన్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులను ఒక ఉన్మాదుల్లా తయారు చేస్తున్నాడని మండిపడ్డారు. తద్వారా హింసను, అరాచకాలను ప్రేరేపించి రాజకీయాలను చేయాలని చూస్తున్నాడని, జగన్ అరాచక రాజకీయాలను ప్రజలు గమనించి వైసిపీని రాజకీయంగా సమాధి చేశారని, అయినా బుద్ధి రాలేదని పేర్కొన్నారు.