News21st Sep 02:23 PMSunil Byrisetty1 min read

డ్రగ్స్ రహిత దేశమే లక్ష్యం!

డ్రగ్స్ రహిత దేశమే ధ్యేయంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నమో యువ 3K రన్ భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పరుశురామ్ రాజు నేతృత్వంలో నిర్వహించడం జరి

డ్రగ్స్ రహిత దేశమే లక్ష్యం!
డ్రగ్స్ రహిత దేశమే ధ్యేయంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నమో యువ 3K రన్ భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పరుశురామ్ రాజు నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాధవ్ మాట్లాడుతూ భారతదేశం వికసిత భారత వైపు అడుగులు వేసేటువంటి అమృతకాలం తరుణంలో యువత తప్పుదారి పట్టకుండా ఉండాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఉండాలని, రాబోవు 2047 సంవత్సరానికి భారతదేశపు ప్రపంచ దేశాల్లో అగ్ర దేశంగా ఉండాలంటే ఆ బాధ్యతను యువత ముందుండి తీసుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఈ పరుగు నిర్వహించారు. మాధవ్ సహా పెద్ద ఎత్తున యువత ప్లకార్డులు పట్టుకుని డ్రగ్స్ కు దూరంగా ఉండాలని నినాదాలు చేశారు.
Indian Youth
Visakhapatnam
Drug Free India
Namo Yuva 3K Run
BJP Youth
Youth Empowerment
Say No To Drugs
Madhav Rao
BJP Events
RK Beach Run
డ్రగ్స్ వ్యతిరేక జాగృతి
మాధవ్ రాష్ట్ర అధ్యక్షుడు
రాజకీయ కార్యక్రమాలు
Scroll for the next article