News26th Jul 05:41 PMSunil Byrisetty1 min read

నందమూరి బాలకృష్ణ పెద్ద మనసు

అనారోగ్యం కారణంగా కష్టాల్లో ఉన్న అభిమానికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అండగా నిలిచారు. కర్నూలు జిల్లాలోని ఆదోనికి చెందిన బద్రిస్వామి బాలయ్య వీరాభిమాని. ఆయన కొం

నందమూరి బాలకృష్ణ పెద్ద మనసు
అనారోగ్యం కారణంగా కష్టాల్లో ఉన్న అభిమానికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అండగా నిలిచారు. కర్నూలు జిల్లాలోని ఆదోనికి చెందిన బద్రిస్వామి బాలయ్య వీరాభిమాని. ఆయన కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. బద్రిస్వామి వైద్యానికి రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. అన్ని లక్షల రూపాయలు వెచ్చించి ట్రీట్మెంట్ చేయించుకునేంత ఆర్థిక స్థోమత లేకుండా పోయింది. బద్రిస్వామి ఆరోగ్య పరిస్థితి గురించి ఆదోని పట్టణ నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు సజ్జాదాస్సేన్ కు తెలిసింది. వెంటనే ఆయన బాలయ్య దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన హిందూపురం ఎమ్మెల్యే.. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ. 10 లక్షలు సాయం చేశారు.
Andhra Pradesh news
Kurnool
Adoni
Nandamuri balakrishna
Balayya charity
humanity
Fans support
బాలయ్య పెద్ద మనసు
వీరాభిమాని
ఆరోగ్య సాయం
Scroll for the next article