Entertainment30th May 03:31 PMSunil Byrisetty1 min read
ఎన్టీఆర్ జాతీయ అవార్డు నా అదృష్టం
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు పూర్తిచేసుకున్న అద్భుతమైన ఘడియలు ఒక వైపు.. ఎన్టీఆర్ నట ప్రస్థాన 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు.. నటుడిగా నేను 50 ఏళ్ళ స్వర్
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు పూర్తిచేసుకున్న అద్భుతమైన ఘడియలు ఒక వైపు.. ఎన్టీఆర్ నట ప్రస్థాన 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు.. నటుడిగా నేను 50 ఏళ్ళ స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకొక వైపు ఉన్నాయని.. సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం "ఎన్టీఆర్ జాతీయ అవార్డు"ని ప్రకటించడంపై బాలయ్య స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మ భూషణ్ తో సత్కరించిన ఇలాంటి తరుణంలోనే తెలంగాణ ప్రభుత్వం "ఎన్టీఆర్ జాతీయ అవార్డు"ని ప్రకటించడం అదృష్టం, దైవ నిర్ణయం, నాన్నగారి ఆశీర్వాదంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రజల దీవెనలు, నాన్నగారి చల్లని కృప, భగవంతుని ఆశీర్వాదాలు నాకు ఎల్లవేళలా ఇలానే ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.