Entertainment29th Apr 02:54 PMSunil Byrisetty1 min read
పంచెకట్టుతో బాలయ్య.. పద్మ అవార్డుతో సందడి!
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఢిల్లీలో పంచెకట్టుతో సందడి చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతు
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఢిల్లీలో పంచెకట్టుతో సందడి చేశారు.
రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక పద్మ భూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు.
ఈ వేడుకకు బాలకృష్ణ పంచెకట్టులో హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.
అలాగే తమిళనాడు నటుడు అజిత్ కూడా అవార్డు అందుకున్నారు.