News22nd Sep 03:15 PMSunil Byrisetty1 min read

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన చేశారు. నంది అవార్డుల కోసం ఈ నెలలో కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అక్టోబర్లో నంది అవార్డులు ప్రకటిస్తామని, డిసెంబర్‌లో అవార్డుల ప్ర

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన
నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన చేశారు. నంది అవార్డుల కోసం ఈ నెలలో కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అక్టోబర్లో నంది అవార్డులు ప్రకటిస్తామని, డిసెంబర్‌లో అవార్డుల ప్రదానం చేస్తామని తెలిపారు. 2012 నుంచి 2016 వరకు ప్రకటించిన.. నంది అవార్డులను కూడా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 2017 నుంచి 2024 వరకు ఏడాదికి 4 అవార్డుల చొప్పున.. ఫిల్మ్, టీవీ అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. 2025 ఏడాదికి ఫిల్మ్, టీవీ నంది అవార్డులు అందిస్తామని చెప్పారు. అమరావతి లేదా విజయవాడ వేదికగా ఫిల్మ్ అవార్డులు అందజేస్తామని, నంది టీవీ అవార్డులను తిరుపతి వేదికగా ఇస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
Scroll for the next article