Spiritual18th Sep 04:29 PMSunil Byrisetty1 min read
తెనాలిలో నంది నాటకోత్సవాలు
తెలుగు నాటకరంగానికి, సంస్కృతికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నంది నాటకోత్సవాలను పునఃప్రారంభిస్తోందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నంది నాటకోత్సవాలు కే
తెలుగు నాటకరంగానికి, సంస్కృతికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నంది నాటకోత్సవాలను పునఃప్రారంభిస్తోందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నంది నాటకోత్సవాలు కేవలం ప్రదర్శనలు కావు... తెలుగు నాటకరంగ సంస్కృతికి, నటీనటుల ప్రతిభకు పట్టం కట్టే అపూర్వ పండుగ..కళను బతికించే నాటక సమాజాలు, సమాజాన్ని చైతన్యపరిచే కళాకారులు – తెలుగు సంస్కృతికి మూలస్తంభాలు అని పేర్కొన్నారు. కళాకారులకు సరైన గుర్తింపునిచ్చేలా ఎఫ్.డి.సి ద్వారా అనేక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. కళలకు కాణాచి అయిన గుంటూరు జిల్లా తెనాలిలో జనవరిలో నంది నాటకోత్సవాలు జరుగుతాయని తెలిపారు. అవార్డుల ఎంట్రీల కోసం రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసి, అక్టోబర్‌లో సెలక్షన్ కమిటీని నియమిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్‌లో ప్రాథమికంగా ఎంపికైన నాటకాల జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. జనవరి 10న ప్రతిష్టాత్మక కందుకూరి అవార్డుల ప్రదానంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, వారం పాటు ఎంపికైన నాటకాల ప్రదర్శనలు, ఆ తర్వాత అత్యంత వైభవంగా నంది నాటకోత్సవాల పురస్కార ప్రదానోత్సవం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.