Politics18th May 03:35 PMSunil Byrisetty1 min read
టీడీపీ నేతపై మాజీ ఎంపీ దాడి.. అరెస్ట్?
ఉద్దండరాయునిపాలెంలో టీడీపీ నాయకుడు ఇసుకపల్లి రాజుపై వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ దాడికి పాల్పడ్డారు. రాజుపై నందిగం సురేష్, అన్న ప్రభుదాసు దాడి చేసినట్లు గుర్తించారు. తీవ్ర గ
ఉద్దండరాయునిపాలెంలో టీడీపీ నాయకుడు ఇసుకపల్లి రాజుపై వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ దాడికి పాల్పడ్డారు.
రాజుపై నందిగం సురేష్, అన్న ప్రభుదాసు దాడి చేసినట్లు గుర్తించారు.
తీవ్ర గాయాలతో మంగళగిరి ఎయిమ్స్ లో రాజు చికిత్స పొందుతున్నాడు.
దాడి ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు.
టీడీపీ కార్యకర్తపై దాడి కేసు నమోదు చేశారు.
అయితే పోలీసులతో నందిగం సురేష్ భార్య బేబిలత వాగ్వాదానికి దిగారు.